పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి ఖాయమని కేంద్రహోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి ఖాయమని కేంద్రహోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎఎ అమలుకు కృషి చేస్తామన్నారు. తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకు గానూ 50 స్థానాలు గెలుచుకుంటుదని షా అన్నారు. దీదీ ఓటమిభయంతోనే మరో నియెజక వర్గంలో పోటిచేస్తున్నట్లు వార్తలు వస్తునాయని అన్నారు. ఆమె ఎక్కడ పోటిచేసిన ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ 200 స్థానాలు గెలుస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు.