ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీ ఓటమి భయం పట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పరగణాల జిల్లాలోని జోయా నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీదీ ఓడిపోతానన్న భయంతో నందిగ్రామ్ లో తిష్ట వేశారని అన్నారు. ఓటమి తథ్యమని భావించిన మమతా మరో నియోజకవర్గంలో పోటీ చేసే విషయమే ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారని మోడీ అన్నారు. అంతేకాక దీదీ కి జై శ్రీరామ్, దుర్గాదేవి ఆరాధన గిట్టదు, తిలకం దిద్దుకొనే వాళ్లంటే పడదని అన్నారు. కానీ కానీ నేను ఆమె లాగ సీజనల్ భక్తుడిని కాదని మోడీ పేర్కొన్నారు.