ఆర్.ఆర్.ఆర్’ చిత్ర‌ శాటిలైట్ రైట్స్ ను ద‌క్కించుకున్న‌‌ పెన్ స్టూడియోస్..!

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర‌ శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ ద‌క్కించుకుంది. ఈవిష‌యాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల శాటిలైట్ హక్కులు తీసుకున్నట్లు చిత్ర బృందం తాజాగా వెల్లడించారు. కాగా తమిళ థియోట్రికల్ రైట్స్‌ని కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకున్న విష‌యం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎపిక్ డ్రామాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. వీరికి జోడిగా ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం విడుద‌ల‌‌ కానుంది.