మెదక్: పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామపంచాయతీలో మహిళా లబ్ధి దారులకు ఎమ్మెల్యే నగదు పురస్కారం అందజేశారు. గతంలో ప్రకటించిన విధంగా గ్రామంలో ఆడపిల్లలు కలిగిన 26 మంది మహిళలకు..అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఒక్కొకరికి 2 వేల 116 రూపాయలు చొప్పున 26 మంది లబ్ధిదారులకు నగదును అందజేశారు. సర్పంచ్ కుంట్ల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జయశ్రీ భూపాల్ రెడ్డి, శంకరంపేట ఎంపీపీ శ్రీనివాస్ జెడ్పిటిసి విజయరామరాజు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మురళి పంతులు స్థానిక ఎంపీటీసీ వినోద రాజు, స్థానిక పాలకవర్గ సభ్యులు ఎంపిటిసిలు సర్పంచులు, నాయకులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.
