రామ మందిర నిర్మాణం కోసం ముస్లింలు సహాయం : జమాల్ సిద్ధిఖీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణా విరాళ సేకరణలో ముస్లింలు  తమ వంతుగా సహాయం చేస్తున్నారని బిజెపి మైనారిటీ జాతీయ అధ్యక్షుడు హాజీ జమాల్ సిద్దిఖీ వెల్లడించారు. దేశంలో అన్ని మతాల వారు రాముడిని దేవుడిగా కొలుస్తారని.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం దేశానికి గర్వకారణమని,రాముడు అందరికి ఆదర్శ ప్రాయుడని ఆయన వెల్లడించారు.

ఇక మైనార్టీలకి రాజకీయాల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని జమాల్ కోరారు. వారు ఇప్ప్పుడిపుడే సంస్థాగతంగా బలపడుతున్నారని , చేయూతను అందిస్తే ఎన్నికల్లో సత్తా చాటుతారని ధీమా వ్యక్తంచేశారు. ఇందుకు ఉదాహరణగా.. బెంగాల్ ను ఉటంకిస్తూ.. ముస్లిం ప్రాబల్యం ఉన్న 45 స్థానాల్లో భాజపా  ఆదిశగా కార్యాచరణను మొదలెట్టిందని.. తాను పార్టీతో పాటు మైనార్టీ సమాజానికి ప్రతినిధిని అని.. దీనిని సాధించే క్రమంలో అడ్డుతగిలే సీనియర్ నాయకులను పట్టించుకోనని , అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటానని  సిద్దిఖీ స్పష్టం చేశాడు.