టీం ఇండియాపై కేన్ విలియమ్సన్ ప్రశంసలు!

భారత జట్టు పై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరిలో జట్టు యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను ఓడించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో భారత్ ఆసీస్ ను 2- 1 తో ఓడించి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. అంతేకాక 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియా ను ఓడించి భారత్ చరిత్ర సృష్టించింది.

ఇక కంగారు గడ్డపై ఆస్ట్రేలియా తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లకు పులి మీద స్వారీ చేయడం లాంటింది. అలాంటి జట్టును ఓడించిన టీంఇండియాకు మనస్ఫూర్తిగా అభినందినలు తెలియజేస్తున్నట్లు కేన్ పేర్కొన్నారు.

కాగా కేన్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండు నెలల్లో ఐపీఎల్ మొదలవుతున్న తరుణంలో తమ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు విలియమ్సన్ స్పష్టం చేశాడు.