దీదీ కి మరో షాక్!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ , పార్టీలోని ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నియోజకవర్గమైన హార్బర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దీపక్ హల్దార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాడు. దీంతో ఎన్నికల సమయానికి ఇంకెంతమంది అసంతృప్తులు పార్టీని వీడుతారాన్న చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటివరకూ తృణమూల్ పార్టీలో కీలక నేతలైన సువెందు అధికారి , సోవన్ చటర్జీ తో సహా 18 సిట్టింగ్ ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి భాజపా తీర్థం పుచ్చుకున్న వారిలో ఉన్నారు. ఇక దీపక్ హల్దర్ విషయమై టీఎంసీ పార్టీ స్పందిస్తూ.. ఆయన పనితీరు సరిగా లేదు, వచ్చే ఎన్నికల్లో సీటు రాదనే ఉద్దేశంతోనే దీపక్ పార్టీ వీడారని.. టీఎంసీ నేతా ఒకరు పేర్కొన్నారు. దీపక్ మాత్రం ప్రజలకు సేవ చేసే విషయంలో పార్టీ ప్రతి విషయంలో తనకు అడ్డుపడుతుందని అందుకే పార్టీకి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని దీపక్ పేర్కొన్నాడు.