కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాష్ నారాయణ్ అన్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని .. సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమని, రాష్ట్రాలకు ఏమి ఇచ్చారన్నది కాదు ప్రజలకు ఉపయోగకరమా కాద అన్నది చూడలని ఆయన స్పష్టం చేశారు.
కాగా వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి, రాజకీయ ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు ఎర్రకోట సంఘటన దేశానికి అవమానమని ప్రతి ఒక్కరు ఖండిచాలి అని వెల్లడించారు.