టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్!

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాలి పీఎస్ కి తరలించారు. ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఖండిస్తున్నట్లు.. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.

కాగా మరోవైపు వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పనను పరామర్శించిడానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి వెళ్తున్నారు. దీంతో నిమ్మాడ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.