ఏప్రిల్లో ఐపీఎల్ 2021?

ఐపీఎల్ సీజన్ 2021 కి రంగం సిద్ధమైంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్లో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ అనంతరం చెన్నెలో ఆటగాళ్ల మినివేలం జరగనుంది. అది పూర్తయిన వెంటనే టోర్నీ పై క్లారిటీ రానున్నట్లు సమాచారం.

కాగా ఆస్ట్రేలియా పై చారిత్రక విజయం సాధించిన భారత జట్టు ,స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బోర్డు ఆటగాళ్ల విశ్రాంతి కి సమయం కేటాయించాలని భావిస్తోంది. అందుకనుగుణంగా టోర్నీ షెడ్యూల్ ఉండే అవకాశం ఉన్నట్లు బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు.

ఇక ఐపీఎల్ నిర్వహణ పై బోర్డు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కరోనా నేపథ్యంలో గత సీజన్ దుబాయ్లో నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టోర్నీ స్వదేశంలో ఉంటుందా , ప్రత్యామ్నాయ వేదికగా టోర్నీ తరలించే అవకాశం ఉందా తెలియాల్సింది.