సీఏలో తమిళ యువకుడికి మొదటి స్థానం!

అఖిల భారత ఛార్టెడ్ అకౌంట్స్ ఫలితాల్లో తమిళ యువకుడికి మొదటి స్థానం లభించింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమిళనాడుకు చెందిన ఇసక్కి ఆర్ముగం-గోమాతి దంపతుల కుమారుడు రాజ్ (23) జాతీయ స్థాయిలో 800 మార్కులకు గాను 553 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. తండ్రి ఆర్ముగం సెళం జిల్లాలోని ఓ ప్రెవేట్ కంపెనీ మేనేజర్ గా పని చేస్తున్నాడు తల్లి గృహిణి. కాగా రాజ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుడేవాడని, ఈ పరీక్ష కోసం తను ఎంతో కష్టపడ్డాడని ,కష్టానికి తగిన ఫలితం సాధించాడని ఆర్ముగం పేర్కొన్నారు.