Telangana:
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆదివారం మీడియాతో కవిత మాట్లాడుతూ..BRS పార్టీలోని ఒక ముఖ్య నేత, తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టీ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని…ఆ నాయకుడికి చెబుతున్నా… మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై పార్టీ నేతలు స్పందించడం లేదని స్పష్టమైన సమాచారం ఉందని కవిత చెప్పకనే చెప్పారు.
లిల్లీ పుట్ నాయకుడు..!
ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “నల్లగొండ జిల్లాలో పార్టీని నాశనం చేసిన వ్యక్తి “లిల్లీపుట్ నాయకుడు” అంటూ ఫైర్ అయ్యారు. జగదీష్ రెడ్డి గెలుపు కూడా “చావు తప్పిన కన్నులో లొట్టబోయిన” తరహాలోనిదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో BRS పార్టీ అత్యధిక స్థానాల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం జగదీష్ రెడ్డే అని ఆరోపించారు. తన గురించి మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కవిత హెచ్చరించారు.