MLCKavita: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.తాజాగా ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. “BRS పార్టీ నాది.. నాదే BRS” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
“ నా నాయకుడు కేసీఆర్ మాత్రమే…”
“బీఆర్‌ఎస్ పార్టీ నాది, నాదే బిఆర్ఎస్.నేను ఈ పార్టీకి సర్వస్వం ఇచ్చాను. నా నేత ఒక్కరే – ఆయన మా నాన్న కేసీఆర్. ఆయన తర్వాత ఎవ్వరినీ నేను నాయకుడిగా గుర్తించను,” అని కవిత తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా కాక, పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కేటీఆర్‌తో మాటలు లేవు…
కవిత ఇంటర్వ్యూలో మరో ముఖ్యమైన అంశం వెల్లడించారు. తన సోదరుడు కేటీఆర్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. “నాకు కేటీఆర్ తో మాటలు లేవు. మా మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి” అని ఆమె ఓపెన్గా చెప్పుకొచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ బాధించింది…
“నాకు ఎంతో దగ్గరగా ఉండే వారి ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంట్లో వారి ఫోన్లు కూడా వినిపించారు. తర్వాత వాళ్లకు సిట్ నోటీసులు వచ్చాయి. ఇది నాకు బాధ కలిగించింది,” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబంలోని సభ్యులనే టార్గెట్ చేయడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రోలింగ్ పై ఆగ్రహం..
“ BRS పార్టీ సోషల్ మీడియా PAID ఆర్టిస్టులు నన్ను ట్రోల్ చేశారని సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని మా నాన్న కు కూడా చెప్పాను. Trolling బ్యాచ్ అంతా పెయిడ్ బ్యాచ్. వారు BRS పార్టీ కార్యకర్తలు కాదు.పార్టీ సైతం ఎప్పుడు అండగా నిలబడలేదు” అంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మొత్తంగా కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఆమె మాటల వెనక బలమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.