Nancharaiah merugumala senior journalist:
ఇది ట్రెయిలర్ మాత్రమే, అసలు పని పూర్తవ్వాలంటే ఇంకా సమయం కావాలి:మోదీ
‘ ప్రధానమంత్రిగా నా పదేళ్ల కృషి కేవలం ట్రెయిలర్ మాత్రమే, ఇంకా నేను ముందు ముందు చేయాల్సింది చాలా ఉంది, ’ అని నరేంద్రమోదీ మంగళవారం అహ్మదాబాద్ లో ప్రకటించారు. మరి ‘మిగిలిపోయిన పనులు’ పనులు పూర్తి చేయడానికి భారత ఓటర్లు మరో పదేళ్లు ప్రధాని కుర్సీలో మోదీని ఉండనిస్తే…చివరాఖరుకు (2034) ఆయన 84 సంవత్సరాల దగ్గరకు చేరుకుంటారు. అంటే ఈ లెక్కన లాల్ ఆడ్వాణీకి, మురళీ జోషీకి పెట్టిన వయోపరిమితిని నరేంద్ర భాయ్ కి వర్తింపచేయరా? సింధీలు, ఉత్తరాఖండ్ బ్రాహ్మణ నేతలకు ఒక రూలు, గుజరాతీ ఓబీసీ హిందూ ఘాంచీ ప్రధానికి మరో నిబంధన సబబు కాదేయో మరి. 21వ శతాబ్దంలో ఓబీసీ హిందూ ఘాంచీలకు ఇన్ని ప్రివిలేజ్‌లు, ప్రత్యేక మినహాయింపులు లభిస్తాయని తెలియక మోదీ కులానికి చెందిన హిందూ ఘాంచీలు ఎక్కువ మంది ఎప్పుడో ఇస్లాంలోకి వెళ్లిపోయారు. సబర్మతీ ఎక్స్‌ప్రెస్ బోగీలకు గోధ్రా స్టేషన్ సమీపంలో (ఈ ఘాంచీ ముస్లింలు రైలు పట్టాలకు ఇరువైపులా గుడిసెలేసుకుని నివసిస్తారు) నిప్పంటించి దగ్ధం చేశారనే నిందతో ఈ ఘాంచీ ముస్లింలు తమ కులస్థుడైన నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే చాలా నష్టపోయారు. కొద్దిపాటి ఆస్తులు, ప్రాణాలు కోల్పోయారు. ఒక్కోసారి ఒకే కులం వారైనా మతాలు వేరైతే కొందరికి ఇబ్బందే మరి భారత ఉపఖండంలో!