పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలు మరువలేనివని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం చెన్నైలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. జ్ఞానం, సృజాత్మకతలకు చెన్నై నిలయమని మోదీ పేర్కొన్నారు. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్ గా ఉందని, ఇప్పుడు యుద్ధ ట్యాంకుల తయారీ కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. మొదట అడయారు లోని ఐఎన్ఎస్ కోస్ట్ గార్డ్ చేరుకొని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అర్జున యుద్ధ ట్యాంక్ మార్క్_1ఏను సైన్యానికి అప్పగించారు. యుద్ధ ట్యాంకులు సైన్యానికి అందజేస్తున్న అందుకు గర్వంగా ఉందని, భారత సైన్యాన్ని ప్రపంచంలోనే ఆధునికమైన సైనిక దళాలు ఒకటిగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. మన భద్రత దళాలను చూసి దేశం గర్విస్తోందని మోదీ అన్నారు. ఈ శతాబ్దం భారత్ దే అన్నారు. రూ. 4,486 కోట్ల అభివృద్ధి పథకాల్ని తీసుకొస్తునామని.. అందులో 3,640 కోట్ల పథకాల్ని ప్రారంభించారు. 1000 కోట్లతో నిర్మించనున్న ఐఐటి మద్రాస్ డిస్కవరీ క్యాంపస్ కి శంకు స్థాపన చేశారు.