తెలంగాణ చిన్నమ్మ సేవలు మరువం: కిషన్ రెడ్డి

మంత్రి కేటీఆర్కి దమ్ము ధైర్యం ఉంటే మజ్లీస్ పై యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులను కించపరిచే మజ్లీస్ పార్టీని పక్కన పెట్టుకొని ప్రధానిపై యుద్ధం చేస్తానని కేటీఆర్ అనడం ఏంటని అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ,బీజేపీ అనుకూల వాతావరణం ఏర్పడిందని.. యువత,ఉద్యోగులు అధికార పార్టీపై అసహనంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకట స్వామి ,ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ‘చిన్నమ్మ ‘ ..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కృషి మరువలేమని కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆమె తెలంగాణ చిన్నమ్మ అని గుర్తు చేశారు.