దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి : బండి సంజయ్

బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తూన్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హుజర్నగర్ గుర్రంబోడు గిరిజన భూములకు సంబంధించి పోరాడుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని.. మేమంతా మళ్ళీ గుర్రంబోడు వెళతామని దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హుజర్నగర్ దుబ్బాక లో ఇచ్చిన హామీలే,ఇప్పడు నాగార్జున సాగర్ లో ఇచ్చారని సంజయ్ వెల్లడించారు. సాగర్ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ కి గిరిజనులు గుణపాఠం చెప్పడం తధ్యమని జోస్యం చెప్పారు.

ఇక హాలియా ధన్యవాదా సభలో సీఎం కేసీఆర్, ప్రశ్నించిన బీజేపీ కార్యకర్తలను, మహిళలను కుక్కలంటూ దూషించడం సంస్కార హీనమని సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుర్రంబోడు భూ ఆక్రమణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సంజయ్ అన్నారు.