Telangana: కాషాయమయమైన వేములవాడ, ఓరుగల్లు.. హోరెత్తిన మోదీ నినాదాలు..!

Pmmodi:  ప్రధాని మోదీ రాకతో రాజన్న సన్నిధానం వేములవాడ…పోరాటానికి పెట్టింది పేరైనా ఓరుగల్లు నగరం పులకరించింది. వీధులన్నీ కాషాయమయంగా మారాయి. రెండు పార్లమెంట్ నియోజాక వర్గాల్లో ఎక్కడ చూసినా.. మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.. భారత్ మాతాకీ జై నినాదాలు హోరెత్తాయి. కారణ జన్ముడు మోడీని చూసేందుకు ప్రజలు  సభకు పోటెత్తారు. తాము ఆరాధించే నాయకుడిని చూసేందుకు జనాలు ఎండను సైతం లెక్కచేయకుండా మోదీ సభలకు పరుగులు తీశారు.  మీకు మేమున్నామంటూ.. దేశ రక్షణ కోసం మళ్ళీ మోదీ ప్రధాని కావాలంటూ  జనాల నినాదాలతో వేములవాడ జనసభ, వరంగల్ సభ హోరెత్తింది.

మరో వైపు   పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగాప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి వేములవాడకు విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన ‘వేములవాడ జనసభ’లో బండి సంజయ్ కాంగ్రెస్ పై పంచ్ ల వర్షం కురిపించారు. మోదీ గొప్పతనాన్ని వివరిస్తూ ఆరడుగుల బుల్లెట్ గా అభివర్ణించారు. బండి సంజయ్ పంచ్ లకు వేములవాడ జన సభ ఉర్రూతలూగింది. సంజయ్ విసిరే ప్రతి పంచ్ కు అడుగడుగునా ఈలల, చప్పట్లు, కేరింతలతో జనం హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే నరేంద్రమోదీ. దేశ చరిత్రలో తొలిసారి దక్షిణకాశీకి విచ్చేసిన నాయకుడు మోదీ మాత్రమే. మోదీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్రను కాంగ్రెస్ చేస్తోంది. నరేంద్ర మోదీకి ఆస్తిపాస్తులు… బ్యాంకు బ్యాలెన్స్ లేవు. ప్రధాని పదవి వద్దనుకుంటే జబ్చకు సంచి వేసుకుని పోయే మహనీయుడు మోదీ అంటూ సంజయ్ కొనియాడారు.

అటు వరంగల్ సభలో మోడీ భద్రకాళి అమ్మ అమ్మవారిపై భక్తిని చాటుకున్నారు. నా స్వస్థలం అహ్మదాబాద్ లో కొలిచే ప్రతేక దైవం భద్రకాళి అమ్మవారు.. అలాగే ఓరుగల్లులో ఉండే భద్రకాళి అమ్మవారు నాకెంతో ప్రత్యేక మంటూ కొనియాడారు. కాకతీయుల గౌరవపతాక అయిన ఇంత చారిత్రిక నగరంలో మిమ్మల్ని కలిసినందుకు అదృష్టం దక్కిందని అన్నారు. 40 ఏళ్ల క్రితం బిజెపికి రెండు ఎంపీ సీట్లు ఉన్నప్పుడు.. అందులో ఒకటి  హనుమకొండ ఉండేదని గుర్తు చేశారు. పదేళ్ల  క్రితం వరకు కాంగ్రెస్ చేసిన పాపాలన్ని అన్ని ఇన్ని కావన్నారు. సురక్షిత భారత్ కోసం ఎన్డీఏ కూటమికి ఓటేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

యువ మిత్రుని కలిశాను మోదీ ట్వీట్..

వరంగల్ పర్యటన సందర్భంగా మోడీ చేసిన ట్వీట్ తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశయమైంది. కరీంనగర్ వేములవాడలో ఎన్నికల ప్రచారానంతరం వరంగల్ పర్యటనకు వెళుతున్న మోదీ లక్ష్మీపురం గ్రామం వద్ద ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకొని తన కారులో ఆడించారు . దీంతో అక్కడున్నవారు ప్రధాని ఔదార్యాన్ని ప్రత్యక్షంగా చూసి ఆనందించారు. బాలుడు తో సంబంధించిన ఫోటోను ప్రధాని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ” నా యువ మిత్రుని కలిసినందుకు ఆనందంగా ఉందంటూ” క్యాప్షన్ తో  ట్వీట్ చేశారు.

Optimized by Optimole