×

Bandisanjay:  రిజర్వేషన్ల రద్దుపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు సవాల్ చేస్తున్నా…. ‘‘మేం ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను రద్దు చేయబోమని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఇక్కడున్న ప్రజలంతా దేవుడిమీద ప్రమాణం చేసి రిజర్వేషన్లు రద్దు కావని చెబుతున్నారు. మరి  ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని భగవంతుడి మీద ప్రమాణం చేసే దమ్ముందా కాంగ్రెస్ నేతలకు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు హాజరయ్యారు. వేలాది మందితో గంగాధర చౌరస్తా కిక్కిరిపోయింది. చౌరస్తా వద్దనున్న భవనాలు ఎక్కి బండి సంజయ్ ప్రసంగం వినడం గమనార్హం. ఈ మీటింగ్ కు మాజీమంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు హాజరైన ఈ సమావేశానికి హాజరైన వేలాది మందితో కలిసి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయబోమని చేతులు చాచి దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు..వంద రోజుల్లో 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తుంటే ప్రజలకు గాడిద గుడ్డు చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తరువాత మిగిలేది గాడిద గుడ్డేనని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి పదేపదే గాడిద గుడ్డును చూపిస్తుంటే… కాంగ్రెస్ పార్టీ  గుర్తు హస్తం కాదేమోనని, గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తుగా మార్చుకున్నారేమోననే అనుమానం ప్రజల్లో నెలకొందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ హస్తం ప్రజల పాలిట భస్మారసుర హస్తంగా మారిందన్నారు బండి సంజయ్.

దేశ ప్రధానిని నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికలివి. బీజేపీ ప్రధాని అభ్యర్ధి మోదీ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు? పోనీ కాంగ్రెస్ కూటమి ప్రధాని అభ్యర్ధి ఎవరు? కెప్టెన్ లేకుండా క్రికెట్ మ్యాచ్ ఆడితే ఎట్లుంటది? కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లనే ,, ఉందని సంజయ్ ఎద్దేవ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని నేను అడుగుతుంటే ‘గాడిద గుడ్డు’ చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్. గాడిదగుడ్డు, గుండు సున్నాల మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీలపై ఎందుకు లేదు?  ఇయాళ కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో తిరుగుతుంటే.. ప్రజలు 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీస్తుంటే… చర్చను దారి మళ్లించేందుకు గాడిద గుడ్డును తెరమీదకు తెస్తున్నారని సంజయ్ ఆరోపించారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

crime: ఒక్క క్లిక్‌తో మొదలై… జీవితాన్ని కుదేలు చేసే మోసాలు..!!

Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో...

Read out all

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి...

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all
Optimized by Optimole