‘జార్ఖండ్ డైనమెట్ ‘ ధోని ప్రత్యేకం!

‘జార్ఖండ్ డైనమెట్ ‘ ధోని ప్రత్యేకం!

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు.వికెట కీపర్,బ్యాట్స్ మెన్ గా క్రికెట్ కెరీయర్ ప్రారంభించిన ఈ ఝార్ఖండ్ డైనమెట్.. భారత జట్టు పగ్గాలు చేపట్టి.. క్రికెట్ చరిత్రలో ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా అనేక రికార్డులు నెలకొల్పాడు. దాదాపుగా 16 ఏళ్లు టీంఇండియాకు విశేష సేవలందించిన మహేంద్రుడు..అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నెసూపర్ కింగ్స్ కు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అభిమానులు అప్యాయంగా తల అని పిలుచుకునే ధోని.. నేడు 41 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈసందర్భంగా ఝార్ఖండ్ డైనమెట్ జీవితంలోని విశేషాలను తెలుసుకుందాం!

(INSTAGRAM)

1981 జూలై 7 న జార్ఖండ్ లోని రాంచీలో ఓ మధ్యతరగతి కుటుంబంలో ఎంఎస్ ధోని జన్మించారు. తల్లిదండ్రులు పాన్ సింగ్,దేవిక. సోదరి జయంతి గుప్తా, సోదరుడు నరేంద్ర సింగ్.తండ్రి రాంచీలోని మెకాన్ కంపెనీలో ఉద్యోగం రావడంతో బీహార్ వదిలి కుటుంబంతో సహా అక్కడే స్థిరపడ్డారు.అతని విద్యాభ్యాసమంతా రాంచీలోనే జరిగింది.శ్యామాలిలో జవహర్ విద్యా మందిర్ లో స్కూలింగ్ పూర్తయ్యింది. ఇంటర్ ఆర్.ఎస్.జె.సి కాలేజిలో పూర్తయింది. సెయింట్ జేవియర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న క్రికెట్ పై ఉన్న మక్కువతో చదువు మధ్యలోనే ఆపేశాడు.

2004 లో బంగ్లాదేశ్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేశాడు ధోని. 2005 లో విశాఖ పట్టణం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థానిపై 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అతని కెరీర్ కి ఇదోక టర్నింగ్ పాయింట్.అదే ఏడాది శ్రీలంకపై 145 బంతుల్లో 183 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో జట్టులో అతనికి స్థానం కన్ఫర్మ్ అయ్యింది. 2007 టీ20 ప్రపంచకప్ కు ఇండియన్ క్రికెట్ బోర్డు అనూహ్యంగా జట్టు పగ్గాలు అప్పజేప్పింది.దీంతో అతని నాయకత్వంలో భారతజట్టు.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచింది.


ధోని నాయకత్వంలోని భారత జట్టు 2009లో తొలిసారి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచింది. అతని కెప్టెన్సీలో 2007లో సిబి సిరీస్.. 2010 లో ఆసియా కప్ గెలిచింది.ఇక సుదీర్ఘ 28 ఏళ్ల నిరీక్షణ అనంతరం భారతజట్టు 2011లో వరల్డ్ కప్ గెలిచింది.2013లో ధోని కెప్టెన్సీలో భారత్..40 సంవత్సరాల తర్వాత టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా ను వైట్ వాష్ చేసింది.2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి గెలిచింది.దీంతో అన్ని ఐసీసీ ట్రోఫిలను గెలిచిన కెప్టెన్గా ధోని చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నైసూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మహేంద్రుడు . అతని కెప్టెన్సీలో ఆజట్టు నాలుగు టైటిళ్లను గెలుచుకుంది.అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 90 టెస్టులు ఆడి 4876 రన్స్ చేశాడు. 350 వన్డేల్లో 10773 రన్స్ చేశాడు. అటు 98 టీ20లు ఆడి 1617 రన్స్ చేశాడు.

ధోనికి చిన్నప్పటి నుంచి కార్లు బైక్స్ అంటే పిచ్చి.వీటికోసం తన ఫాంహౌస్ లో ఓ గ్యారేజీ కూడా ఉంది. మ్యాచ్ అయిపోయాక బైక్, కార్లపై తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అతని దగ్గర ఫెరారీ, ఆడి కార్లతో పాటు .. కవాసకి నింజా హెచ్‌2, హార్లీ డేవిడ్‌సన్‌ లాంటి ఖరీదైన బైక్‌లు అతని దగ్గరున్నాయి. ధోని జీవిత చరిత్ర ఆధారంగా ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ క్యాప్షన్ తో సినిమా కూడా వచ్చింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చిత్రంలో ధోనిగా కనిపించి అలరించాడు. అతనికి ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాతో గౌరవించింది.

మహేంద్రుడి వివాహం చిన్ననాటి స్నేహితురాలు సాక్షితో జరిగింది. మ్యాచ్ అనంతరం కోల్‌కతాలోని ఓ హోటల్లో అనుకోకుండా ఇద్దరు కలిశారు. ఆతర్వాత వారిద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్ళికి దారి తీసింది.కెరీర్ తోలినాళ్లలో విభిన్న హెయిర్ స్టైల్ తో ధోని కనిపించేవారు. అతని హెయిర్ స్టైల్ కి ఏకంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్ ముగ్దుడయ్యాడు. మైదానంలో అతను కూల్ గా ఉంటాడు. దీంతో అందరూ అతనని మిస్టర్ కూల్ అని పిలవడం పరిపాటిగా మారింది. హెలికాప్టర్ షాట్ అతని ప్రత్యేకత. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ధోని కొట్టిన సిక్సర్.. భారత క్రీడాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై సిక్సర్ కొట్టి విజయాన్ని ఖరారు చేసిన ధోని!