టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అదేంటి ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాలేదు! కొత్త పాత్ర ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అది క్రికెట్ కు సంబంధించి కాదండోయ్ ఓ నవలకు సంబంధించి. మహి ప్రధాన పాత్రగా ‘అధర్వ’ అనే నవల రాస్తున్నారు సంగీత దర్శకుడు రమేశ్ తమిళ్మణి. ఇది గ్రాఫిక్ నవల. ఇందులోని ధోనీ ఫస్ట్లుక్ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో కత్తి పట్టి కిర్రాక్ లుక్లో కనిపిస్తున్నారు మహి.ఈ గ్రాఫిక్ నవలను త్వరలో అమెజాన్లో విక్రయించనున్నారు. ప్రీ ఆర్డర్ల ద్వారా దీనిని కొనుగోలు చేసే అవకాశముందని మోషన్ పోస్టర్లో ప్రకటించారు.
మరోవైపు ఈ ప్రాజెక్టుతో అనుసంధానం అయినందుకు చాలా థ్రిల్గా ఉందన్నారు ధోనీ . ఇది ఆకర్షణీయమైన గ్రాఫిక్ నవల అని పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం ధోని ఐపీఎల్ మెగావేలం కోసం ధోని.. జట్టుతో కలిసి చెన్నైలో ఉన్నాడు.