కరోనా కొత్త వేరియంట్.. చైనాలో గుట్టలుగా శవాలు…

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిన కరోనారక్కసి మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న డ్రాగన్ కంట్రిలో మాయదారి మహమ్మారి ..ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో అధికారులు చేతులెత్తేస్తారు. దీంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఆఖరికి కరోనాతో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి వెయిటింగ్ లిస్టు పెరుగుతున్న పరిస్థితి నెలకొనడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఇక ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF_7తో చైనాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం మార్చి నెలలోపు డ్రాగన్ కంట్రీలో 80 కోట్లకు పైగా వైరస్ సోకే ప్రమాదమున్నట్లు..10 లక్షలకు పైగా జనం మరణించే అవకాశం ఉన్నట్లు నివేదిక చెబుతోంది.ఇప్పటికే బీజింగ్ సహ పలు నగరాల్లోని ఆసుపత్రుల్లో ఎక్కడ చూసిన శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి.దీంతో పరిస్థితి ఔట్ ఆఫ్ కంట్రోల్ అవడంతో చైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది.

మరోవైపు భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF_7 కలకలం రేపింది. గుజరాత్ వడోదరలో ఓ ఎన్ఆర్ఐ మహిళకు ఈ వేరియంట్ సోకింది.  జీనోమ్ సీక్వెనింగ్ లో వేరియంట్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు.దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గురిని ఐసోలేషన్ కు తరలించారు.ఇప్పటివరకు దేశంలో ముడు కేసులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. అటు వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులలో హై అలెర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పరిస్థితులు తలెత్తిన  ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ స్పష్టం చేశారు.

Optimized by Optimole