కొత్తగా క్రీమ్ ఫంగస్ వెలుగులోకి!

కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్ లు జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న బ్లాక్.. వైట్..ఎల్లో ఫంగస్ జాబితాలో.. తాజాగా క్రీమ్ ఫంగస్ చేరింది. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఒక క్రీమ్​ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్​, వైట్​ ఫంగస్​ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జబల్​పుర్​లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. వీరికీ జబల్​పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స అందిస్తుండగా.. 50 మంది ఇతర ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.మరోవైపు, బ్లాక్​ ఫంగస్​ చికిత్స కోసం వైద్య పరికరాలు, ఔషధాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఔషధాల రవాణా కోసం హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.
కరోనా ఉధృతి అదుపులోకి వస్తున్న.. ఫంగస్ ల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచిస్తున్నారు.

Optimized by Optimole