తెలంగాణలో లాక్ డౌన్ మరో వారం రోజులు పొడగింపు..?

తెలంగాణలో కరోనా కట్టడి దృష్ట్యా విధించిన లాక్ డౌన్ గడువు జూన్ 30న ముగియనుంది. అయితే లాక్ డౌన్ కొనసాగించాలా.. లేదా అన్నది రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నపట్టీకి.. మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రజలుభారీగా బయటకురావడం.. మినహాయింపుల పేరుతో మరికొందరు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో.. విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. మంత్రివర్గ సమావేశం(ts cabinet meeting)లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇంకా కొన్నిరోజులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఆంక్షలు కొనసాగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ పొడగించాలా లేదా అన్న విషయంలో ప్రభుత్వం పలు నివేదికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న సడలింపు సమయంలో ప్రజలు భారీగా బయటకు వస్తున్నారు. రద్దీని తగ్గించేందుకు ఆ సమయంలో మార్పుచేయాలన్న ఆలోచన ప్రభుత్వవర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ఉదయం 6గంటల నుంచి కాకుండా…. 7నుంచి 12 గంటల వరకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మినహాయింపుల పేరుతో ప్రజలు భారీగా రోడ్లపైకి వస్తున్నవారిని.. కట్టడి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆయాశాఖలు నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. అన్నిఅంశాలను పూర్తిస్థాయిలో చర్చించి రేపటి కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవారం.. లేదా 10రోజులపాటు లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నట్లు…అయితే వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నందున కొన్ని సడలింపులు ఉండొచ్చని ప్రభుత్వవర్గాల సమాచారం.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా.. లాక్‌డౌన్ అమలు.. ఇంటింటి జ్వరసర్వే(fever survey), కొవిడ్ ఓపీ సేవలు తో ప్రభుత్వం కట్టడికి కృషి చేస్తోంది. అంతేకాక మహమ్మారి వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉండే వివిధ వర్గాలవారిని సూపర్ స్ప్రెడర్లుగా(super spreaders) గుర్తించి. ప్రత్యేకంగా టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు.