కొవిడ్ తో చనిపోయిన కుటుంబాలకు కేంద్రం భరోసా!

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఐదు లక్షల రూపాయల అరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
పి ఎం కేర్స్ నిధుల నుంచి ఈ బీమా ప్రీమియం చెల్లిస్తామని తెలిపింది..
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కు ఉచిత విద్య.. వారికి పద్దెనిమిదేళ్లు నిండాక నెలసరి భత్యం 23 ఏళ్లు నిండాక పది లక్షల రూపాయలు కేంద్రం అందిస్తూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాక పిల్లల ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ అందించేందుకు తోడ్పాటు.. ఆ రుణంపై వడ్డీని డీఎంకే నిధుల నుంచి చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.