నల్గొండ బిజెపిలో కొత్త నేత తెరపైకి.. సీనియర్లు గుస్సా?

నల్గొండ బీజేపీ లో కొత్త నేత తెరమీదికి రావడంపై చర్చ జరుగుతుంది. ఎవరూ ఈ నేత?ఎందుకింత హంగామా? ఉన్న నేతల మధ్య గ్రూప్ తగాదాలు చాలవన్నట్లు.. ఇప్పటివరకు ఏ సభ..సమావేశాల్లో కనిపించని.. వినిపించని నేతను ప్రోజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి? పార్టీ కోసం కష్టపడిన నేతల పరిస్థితి ఎంటన్న విషయంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అటు సీనియర్ నేతలు  పైకి మౌనంగా కనిపిస్తున్న సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా నల్గొండ  బీజేపీలో డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పేరు పై నియోజక వర్గ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.పట్టణంలో అతని జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. కొందరు ఫ్లెక్సీలు తొలగింపు సమర్ధిస్తుండగా..మరికొందరు రూల్స్ తెలియకుండా ఎలా ఏర్పాటు చేస్తారని..కావాలనే అలా చేశారా.. గింత చిన్న విషయం తెలియకుండా చేస్తారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న వర్శిత్.. గ్రూపు లోల్లిల మధ్య సందెట్లో సడేమియా లా ఎంట్రీ ఎందుకని పార్టీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. జిల్లా నుంచి టికెట్ రేసులో ఉన్న అభ్యర్థులు .. ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ  ఆదేశానుసారం ఎప్పటికప్పుడు సభలు.. సమావేశాలు తో బిజీ షెడ్యూల్ గడుపుతున్న నేతలకు.. వర్షిత్ రాకా మింగుడుపడని అంశమని కార్యకర్తల వాదనగా వినిపిస్తుంది.

ఇప్పటికే జిల్లాలో నాయకత్వ లోపంతో సతమతమవుతున్న కమలనాధులు.. కొత్త నేత రాకపై బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. దీనిపై రాష్ట్ర అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..

Related Articles

Latest Articles

Optimized by Optimole