దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. సెంచరీ దాటిన కేసులు!

భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సెంచరీ కొట్టింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంలో 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ కేసులు 101కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇక 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ కేసులు.. 101కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22, రాజస్తాన్‌లో 17, తెలంగాణలో 8, కర్నాటకలో 7, కేరళలో 5, గుజరాత్‌లో 5, ఏపీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు.
అటు కలవరపెడుతున్న ఒమిక్రాన్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగా హైదారాబాద్‌ మీర్‌చౌక్‌లో 5 రోజుల క్రితం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన 35 ఏళ్లు యువకుడికి ఒమిక్రాన్ సోకింది. అలాగే హన్మకొండలో ఈనెల 3న యూకే నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు మీర్‌చౌక్ ప్రాంతంలో RT-PCR టెస్టులు ముమ్మరం చేసిన వైద్య అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది కాలనీల్లో పూర్తిగా శానిటైజేషన్ చేశారు. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు 8కి చేరిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మూడు, గురువారం మరో నాలుగు కొత్త వేరియంట్ కేసులు నమోదయిందని తెలిపారు. కొత్త వేరియంట్ లక్షణాలు అంత తీవ్రంగా లేకున్నపటికీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డీహెచ్ సూచించారు.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ నిర్విరామంగా కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 136 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది. అయితే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. అత్యవసర అయితే తప్పా, ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం.