కోహ్లీ_గంగూలీ వివాదంపై స్పందించిన మాజీ ఓపెనర్!

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ- బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వివాదంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 కెప్టెన్సీ విషయంలో తననెవరూ సంపద్రించలేదని విరాట్ చెప్పగా… సారథ్య బాధ్యతల నుంచి వైదొలగొద్దని తాను కోహ్లీకి వ్యక్తిగతంగా చెప్పినట్టు నాలుగైదు రోజుల క్రితం గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. తాజాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ఈ వివాదంలో అసలు నష్టపోయింది భారత క్రికెట్ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ ప్రశ్న అబద్దం ఎవరు చెబుతున్నారు.. ఎవరిది నిజం.. ఎవరు తప్పు అనేది కాదు.. సమస్య ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది…? ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య కాదు. ఈ వివాదంలో వాస్తవంగా నష్టపోయింది భారత క్రికెట్…’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నిజం కల్పన కన్నా బలంగా ఉంటుందని అంటారు. అది విన్నప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఇది సమాచార లోపం వల్లే జరిగింది. అయితే ఇవన్నీ పుట్టిస్తున్నది ఎవరు..? ఎందుకోసం చేస్తున్నారనేది ఏమీ అర్థం కావడం లేదు…?’అని తెలిపాడు ఆకాశ్ చోప్రా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *