రసకందాయంగా మునుగోడు రాజకీయం.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు?
మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు చేరికల కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తనతో పాటు మరికొంతమంది ముఖ్యనేతలు బీజేపీలోకి రాబోతున్నారని వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల్లో కలవరం మొదలైంది. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు క్యాడర్ చేజారిపోకుండా నియోజకవర్గంలో మకాం వేసి…