Telangana: నేతలు మారకుంటే… కాంగ్రెస్ కు కష్టాలే..!!
IncTelangana: తెలంగాణలో కాంగ్రెస్ ఇవాళ నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉంది. పయనం ఎటు? మెరుగైన స్థితికా? పతనానికా? అన్నది పార్టీ రాష్ట్ర నాయకత్వం చేతిలో ఉంది. అధికారంలో ఉన్నపుడు సంస్థాగతంగా-రాజకీయంగా పార్టీని ప్రజాక్షేత్రంలో పటిష్టంగా ఉంచాల్సిన బాధ్యత అటు ముఖ్యమంత్రి, ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ఇరువురిపైనా ఉంటుంది. జోడు గుర్రాల్లా సమన్వయంతో రాష్ట్ర కాంగ్రెస్ రథాన్ని ముందుకు నడపాల్సిన ఈ ఇద్దరి వ్యవహారశైలీ… అటు అధిష్టానానికి ఇటు కార్యకర్తల శ్రేణికి ఎవరికీ…