literature: జ్ఞాన పరిమళ పుస్తక పుష్పాలు..!
Telugu literature: తెలుగునాట రాజకీయ పుస్తక రచన తక్కువ. సమకాలీన రాజకీయ పరిణామాల మీద విశ్లేషణాత్మకమైనవి మరీ తక్కువ. అధీకృత డాటా, సాధికారిక సమాచారం, తెరవెనుక సంగతులను సమ్మిళితం చేసి వెలువరించిన… వ్యాఖ్యాయుతమైన పుస్తకాలు దాదాపు లేవనే చెప్పాలి. ఒకటీ, అరా ఉన్నాయేమో తెలుసుకోవాలి. తెలుగు రాజకీయాలకు సంబంధించి తెలుగులోనే కాక ఇంగ్లీషులోనూ లేవు ఎందుకో! సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు వంటి ఒకరిద్దరు రాసిన కొన్ని పుస్తకాలున్నా అవి డాటా ప్రధానమైనవి మాత్రమే! సీనియర్…