పార్థ సారథి పొట్లూరి: పాలించే రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?ప్రస్తుత పాకిస్థాన్ పరిస్థితి ఇలాగే ఉంది !
తమ రాజకీయ భవిష్యత్ కి అడ్డువస్తాడానే నెపం తో సైన్యం,ప్రజా ప్రభుత్వం రెండూ కలిసి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టాలనే ప్రయత్నాలలో తల మునకలు అయిఉన్న తరుణంలో ప్రజలూ,అధికారులు కలిసి గోధుమలు దోచుకున్నారు !
రష్యా పాకిస్థాన్ ల మధ్య ఒప్పందం లో భాగంగా గోధుమలు సరఫరా జరిగింది రష్యా నుండి పాకిస్థాన్ కి !
పాకిస్థాన్ కి చెందిన డాన్ పత్రిక సమాచారం మేరకు రష్యా పాకిస్థాన్ ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రష్యా 4,50,000 టన్నుల గోధుమలు పాకిస్థాన్ కి సరఫరా చేయాలి.
అయితే మొదటి విడతాగా రష్యా 50 వేల టన్నుల గోధుమలని కార్గో షిప్ ద్వారా పాకిస్థాన్ కి పంపిన్చింది! రష్యా షిప్ బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్ కి చేరుకుంది ! గ్వాదర్ పోర్ట్ లో గోధుమలని దించి దశల వారీగా మొత్తం 10 జిల్లా కేంద్రాలలో ఉన్న గోదాములకి తరలించారు అధికారులు ! అలాగే గ్వాదర్ లోని పోర్టుకి అనుసంధానంగా ఉన్న గోదాములలో 10 వేల టన్నుల గోధుమలు ఉంచి మిగతా 40వేల టన్నుల గోధుమలని జిల్లా కేంద్రాలకి తరలించి ఆయా జిల్లాలో ఉన్న ప్రజలకి అమ్మకాని పెట్టాలి !
కానీ జిల్లా కేంద్రాలలో ఉన్న గోదాములలో ఉండాల్సిన గోధుమలకి రెక్కలు వచ్చి ఎగిరిపోయాయి ! ఒకటి కాదు రెండు కాదు మొత్తం 40 వేల టన్నుల గోధుమలు మాయం అయ్యాయి !
ఎవరు చేశారు ఈ పని ?
ప్రభుత్వ అధికారులు ప్రజలతో కుమ్ముక్కు అయిపోయి తలా కొంచెం దొంగిలించి పంచేసుకున్నారు ! ప్రభుత్వ గోదాములకి ఇంచార్జ్ గా ఉన్న ఫుడ్ సూపర్ వైజర్స్ , ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మరియు స్థానిక ప్రజలు అందరూ కలిసి గోధుమలని తరలించేశారు రాత్రికి రాత్రే !
మొత్తం 49 మంది ఫుడ్ సూపర్వైజర్స్, 18 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కి షో కాజ్ నోటీసులు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం !
జీతాలు సరిగ్గా రావడం లేదు సరికదా ఇంట్లో గోధుమ పిండి కి దిక్కులేకుండా ఉన్న స్థితిలో ఉద్యోగం ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే భావనలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు !
మరి గోదాములకి కాపలా గా ఉన్న పోలీసుల మాటేమిటి ?
అధికారులు,ప్రజలు స్వేచ్ఛగా దోచుకోవడానికి సహకరించారు పనిలో పనిగా వాళ్ళూ పట్టుకెళ్లారు ! ఎంత మంది మీద కేసులు పెడతారు ? అవి కోర్టులలో తేలే సరికి ఎవ్వరూ బ్రతికి ఉండరు ! అలా అని ఆయా జిల్లా కేంద్రాలలో ఉన్న కోర్టు ఉద్యోగులు కూడా ఒక చేయి వేసేశారు ! పోలీసు అధికారులకి,న్యాయమూర్తుల ఇళ్ల కీ వీళ్ళే సప్లై చేశారు ! ఇక ఎవరు ఎవరిని ప్రశ్నిస్తారు ? కేసులు పెట్టేది పోలీసులు వాటిని విచారించేది న్యాయమూర్తులు కాబట్టి ఇవి ఇప్పట్లో తేలేవీ కావు !
ఈ తతంగం అంతా రాత్రి పూట జరిగింది కాబట్టి జిల్లా ముఖ్య కేంద్రం దాటి గోధుమ బస్తాలు బయటికి వెళ్లలేదు ! మరి 10 జిల్లాలో ఉన్న గ్రామాల సంగతి ఏమిటీ ? అని అడిగితే వాళ్ళ ప్రాంతాలకి గోధుమలు వెళ్ళినప్పుడు వాళ్ళు డబ్బు పెట్టి గోధుమలు కొనకుండా ఇలాగే బలవంతంగా దోచుకోవాలి అనే సమాధానం వచ్చింది !
ఇలా ప్రజలు,అధికారులు తిరగబడడానికి కారణం పాకిస్థాన్ లో ఉన్న సైన్యాధికారులు మరియు రాజకీయ నాయకులే కారణం ! వచ్చిన గోధుమలని వచ్చినట్లుగా ముందు సైన్యాధికారులు ఆ తరువాత రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులు దర్జాగా నిల్వ చేసుకొని మిగతావి పేద ప్రజలకి వదిలేస్తున్నారు ! వీళ్ళేవ్వరూ డబ్బులు ఇచ్చి గోధుమలని కొనరు కానీ పేద ప్రజలకి కిలో 130 నుండి 160 రూపాయాలకి అమ్ముతున్నది ప్రభుత్వం!
రష్యా నుండి రాబోయే మిగతా 4 లక్షల టన్నుల గోధుమలని ఎలా రక్షించుకోవాలో అని ఉన్నతాధి కారులు తలలు పట్టుకుంటున్నారు ఎందుకంటే పోలీసులని ఇక నమ్మే పరిస్తితి లేదు !
ప్రభుత్వమే ప్రజలకి నేర్పింది గోధుమలని ఎలా దొంగిలించాలో అని !
గత డిసెంబర్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ కి లారీల ద్వారా గోధుమలని పంపింది పాకిస్థాన్ రోడ్డు మార్గం ద్వారా. చెకింగ్ చేసి అనుమతి ఇస్తామని చెప్పి భారత్ పంపిన మంచి గోధుమలని దించేసి పాక్ గోడౌన్ ల పురుగు పట్టిన గోధుమలని లారీలలోకి ఎక్కించే క్రమంలో కూలీల రూపంలో జనాలు భారత్ గోధుమలని దొంగతనం చేశారు ! ఇప్పుడు నేరుగా ప్రభుత్వ అధీనంలో ఉన్న గోధుమలనే దొంగతనం చేశారు !
పాకిస్థాన్ లో ఆహార పదార్ధాల కొరత ఎంత తీవ్రంగా ఉందో ఈ సంఘటన చెప్పకనే చెప్తున్నది !
ఇంతకీ రష్యా అధ్యక్షుడు పుతిన్ పాకిస్థాన్ కి గోధుమలు సరఫరా చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడు ?
నిజానికి పాకిస్థాన్ కి కావాల్సిన గోధుమలలో 40% ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు యుద్ధం వలన ఉక్రెయిన్ నుండి సరఫరా ఆగిపోయింది. ఉక్రెయిన్ గోధుమలకి చెల్లించాల్సిన డాలర్లు పాకిస్థాన్ దగ్గర లేవు కాబట్టి ఉక్రెయిన్ కి యుద్ధ టాంకుల విడి భాగాలని సప్లై చేస్తూ వచ్చింది గత సంవత్సర కాలంగా ! పుతిన్ పాకిస్థాన్ కి గోధుమలు ఇవ్వడానికి ఒప్పుకుంటూ ఉక్రెయిన్ కి ఎలాంటి విడి భాగాలు కానీ మందు గుండు సామాగ్రి కానీ సప్లై చేయను అనే హామీ తీసుకొని గోధుమలని ఇవ్వడానికి అంగీకరించాడు !
ఇంతకీ రష్యా ఎగుమతి చేసిన గోధుమలు ఉక్రెయిన్ భూభాగం నుండే పాకిస్థాన్ కి ఇస్తున్నది.
జైహింద్ ! జై భారత్ !