ఆర్సీబీపై పంజాబ్ విక్టరీ!

ఐపీఎల్ 2021లో బెంగుళూరుకు పంజాబ్ కింగ్స్ షాకించింది. శుక్రవారం జరిగిన పోరులో ఆజట్టు ఛాలెంజర్స్ బెంగుళూరుపై 34 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగుల చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(91 నాటౌట్‌; 57 బంతుల్లో 7×4, 5×6) ఒంటరి పోరాటం చేశాడు. క్రిస్‌గేల్‌(46; 24 బంతుల్లో 6×4, 2×6), హర్‌ప్రీత్‌బ్రార్‌(25; 17 బంతుల్లో 1×4, 2×6) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో జేమీసన్‌ రెండు వికెట్లు తీయగా చాహల్‌, సామ్స్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 145/8 స్కోరుకే పరిమితమవడంతో పంజాబ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(35; 34 బంతుల్లో 3×4, 1×6), రజత్‌ పాటిదర్‌(31; 30 బంతుల్లో 2×4, 1×6), హర్షల్‌ పటేల్‌(31; 13 బంతుల్లో 3×4, 2×6) రాణించిన ఫలితం లేకుండా పోయింది. పంజాబ్‌ విజయంలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ మూడు వికెట్లు తీసి కీలకంగా వ్యవహరించాడు. పంజాబ్‌ బౌలర్లలో రవిబిష్ణోయ్‌ రెండు వికెట్లు తీయగా షమి, జోర్డాన్‌, మెరిడిత్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.