చెన్నై ఘన విజయం!

ఐపీఎల్లో చెన్నై విజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన పోరులో అజట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌(57; 55 బంతుల్లో 3×4, 2×6), మనీశ్‌ పాండే(61; 46 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకాలతో రాణించారు. చివర్లో విలియమ్సన్(26 నాటౌట్; 10 బంతుల్లో 4×4, 1×6), కేదార్‌ జాధవ్‌(12 నాటౌట్‌; 4 బంతుల్లో 1×4, 1×6) మెరుపులు మెరిపించడంతో సన్ రైజర్స్ జట్టు 171 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఎంగిడి రెండు, సామ్‌కరన్‌ ఒక వికెట్‌ తీశారు. అనంతరం చెన్నై జట్టు 172 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(75; 44 బంతుల్లో 12×4), డుప్లెసిస్‌(56; 38 బంతుల్లో 6×4, 1×6) అర్ధ శతకాలతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆపై మెయిన్ అలీ(15; 8 బంతుల్లో 3×4), రైనా(17; 15 బంతుల్లో 3×4), జడేజ(7; 6 బంతుల్లో 1×4) మిగిలిన పనిని పూర్తి చేయడంతో చెన్నై ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.