కాలం మారింది, మనిషి మేధస్సుతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. కానీ ఆలోచనల ధోరణి లో మాత్రం మార్పు రావడం లేదు. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన మూఢనమ్మకాల పేరుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అందుకు నిదర్శనమే చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన సంఘటన..
చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలోని నివాసముంటున్న పురుషోత్తం నాయుడు, పద్మజా దంపతులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరికి అలేఖ్య సాయి దీప ఇద్దరు కూతుర్లు. తండ్రి కళాశాల ప్రిన్సిపల్ పనిచేస్తుండగా, తల్లి కరస్పాండెంట్ గా పనిచేస్తుంది. పొరుగు రాష్ట్రంలో చదువుతున్న ఇద్దరు కూతుళ్లు, కరోనా నేపథ్యంలో ఇంటి పట్టునే ఉంటున్నారు. పురుషోత్తం దంపతులు ఇంటికి.. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు వ్యక్తులు వస్తుండేవారని, నిత్యం పూజలు జరుగుతూఉండేవి. అందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇద్దరు కూతుళ్లను డంబెల్స్ తో కొట్టి హతమార్చారు. అనంతరం పూనకంతో ఊగిపోయి. పుణ్య లోకాలకు వెళ్లిన ఇద్దరు కూతుళ్లు తిరిగి వచ్చేస్తారు అంటూ కేకలు పెట్టారు. వెంటనే దగ్గరలో ఉన్న స్నేహితుడు దారుణ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
యువతి పోస్ట్ కలకలం..ఈ
ఈటనకు సంబంధించి ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.. చనిపోయిన వారిలో ఒకరైన సాయి దివ్య మూడు రోజుల కిందట సోషల్ మీడియా లో ‘ శివ ఇస్ బ్యాక్.. వర్క్ డన్ అంటూ’ పెట్టిన పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది.
నిందితులు నివాసం ఉంటున్న ఇంట్లో చిత్రవిచిత్రమైన ఫోటోలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.