రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత రోహిత్ రెడ్డికి లేదు :పట్లోళ్ల రఘువీర్ రెడ్డి

 వికారాబాద్: ఎమ్మెల్ పైలెట్ రోహిత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శించి స్థాయి రోహిత్ రెడ్డికి లేదన్నారు. అమ్ముడుపోయిన వ్యక్తి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పార్టీ మారిన రోహిత్ రెడ్డి ఎంతకు అమ్ముడుపోయాడో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడుని విమర్శించే అర్హత అముడుపోయిన ఎమ్మెల్యేకి లేదని తేల్చిచెప్పారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి.. ఆ పార్టీపై విమర్శలు చేస్తున్న రోహిత్ రెడ్డి చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని మండిపడ్డారు.

ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని రోహిత్ రెడ్డి.. జిల్లాలో బ్లాక్ మెలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు రఘువీర్ రెడ్డి. సర్పంన్ పల్లి ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ భూములను కబ్జా చేసి వ్యాపారం చేస్తూ పైసలు దండుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు.. చిల్లర చేష్టలు మానుకొకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నాలుగు రూపాయలు ఎక్కువగా వస్తాయంటే కే ఏ పాల్ పార్టీలో కూడా చేరడానికి రోహిత్ రెడ్డి సిద్ధపడతాడని రఘువీర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Optimized by Optimole