తాండూర్ లో బలమైన నేత కోసం పీసీసీ కసరత్తు..

Tandur:  రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం ఉన్న నియోజక వర్గం తాండూరు.  రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు అందించిన ఘనత ఈ నియోజక వర్గ ప్రజలది. చివరిగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన సభకు ఎంపికైన పైలట్ రోహిత్ రెడ్డి అనంతర కాలంలో గులాబీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి బరిలో దిగనున్నాడు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బలమైన నాయకుడు లేకుండా పోయాడన్న నైరాశ్యం లో పార్టీ శ్రేణుల్లో ఉన్నది. తాండూర్ కాంగ్రెస్ పార్టీనీ ముందుకు నడిపించే నాయకుడు లేక శ్రేణులు పక్కచూపులు చూస్తున్నారు. పార్టీ నాయకులకు భరోసా కల్పించే  యువ నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. 

అమ్ముడు పోనీ నాయకుడు కావాలి

మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. అందర్నీ ఏకతాటిపై నడిపించే నాయకుడు కోసం కాంగ్రెస్ పెద్దలు వెతుకులాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నుండి మంత్రి మహేందర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి లను తట్టుకునే నిలబడే బలమైన యువ నాయకుడి కోసం పార్టీ శ్రేణులు అధిష్టానం వద్ద పట్టు బడుతున్నాయి.

     

గ్రామీణ ప్రాంతాల్లో బలంగా కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గం సంస్థాగతంగా గ్రామీణ ప్రాంతాల్లో  పటిష్టంగా ఉంది. తమ భుజస్కందాలపై మోసి విజయాన్ని అందిస్తే..  అమ్ముడు పోయే నాయకులు వద్దని, పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పదవులు లేకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడే నమ్మకమైన యువ నాయకుడిని వచ్చే ఎన్నికల్లో తాండూరు అభ్యర్థిగా ప్రకటించాలని ద్వితీయ శ్రేణి నాయకులు  హైకమాండ్ను కోరుతున్నారు.

రఘువీర్ రెడ్డి సరైన అభ్యర్థి…

ప్రస్తుతం  పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి సరైన సరైన అభ్యర్థి అని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా మాజీ శాసన సభ్యులను డీకొట్టే బలం ఉన్న వ్యక్తి కావడం, యువతతో మంచి సంబంధాలు ఉండటం, భారీ బంధుగణం ఉండడంతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉండడం కూడా ఆయనకు కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కీలక మైన ముఖ్య నాయకులు సైతం ఇప్పటికే రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే తాండూర్ నియోజక వర్గ  అభ్యర్థిత్వం కోసం రమేష్ మహారాజు, కిచ్చన్న గారి లక్ష్మ రెడ్డి, పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి, కల్వ సుజాత, దారాసింగ్ గాంధీ భవన్ లో దరఖాస్తు దాఖలు చేశారు.

 

Optimized by Optimole