వందేమాతరం గేయంతో యావత్ భారతావనిని బెంగాల్ కట్టిపడేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి బెంగాల్‌లో దీదీ బయటివ్యక్తుల అనే మాటలు మాట్లాడటం భావ్యం కాదని మోదీ ధ్వజమెత్తారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ .. సుభాష్ చంద్రబోస్ , బంకీఛంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగుర్ వంటి మహనీయులు పుట్టిన నేల బెంగాల్ అని కొనియాడారు. భారత్‌లో పుట్టిన ప్రతి ఒక్కరు భరతమాత బిడ్డలని మోదీ స్పష్టం చేశారు.
మమ్మల్ని బయటివారిగా సంభోదిస్తూ మమతా అవమానిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బిజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడివారే ముఖ్యమంత్రి అవుతారని మోదీ తెలిపారు. నందిగ్రామ్ ప్రచారంలో దీదీ గాయంపై ప్రధాని స్పందిస్తూ.. దీదీ తప్పుడు ఆరోపణలతో తప్పదోవపట్టిస్తున్నారు.. ఆమెను ప్రజలు ఎప్పటకి క్షమించరు.. ఎన్నికల్లో ప్రజలు ఆమెకు తగినరీతిలో సమాధానం చెబుతారని మోదీ పేర్కొన్నారు.