Bandisanjay: కరీంనగర్ ప్రజలకు… ప్రత్యేకించి హిందూ బంధువులారా…..మీకో సంతోషకరమైన వార్త… అయోధ్యకు వెళ్లలేదని బాధపడుతున్నారా?… రామయ్యకు దూరమయ్యామని చింతిస్తున్నారా….. మీకు ఇక ఆ భాధ అక్కర్లేదు… ఎందుకంటే ఏకంగా అయోధ్య రామయ్య మీ ఇంటికే వస్తున్నడు… అందాల రామయ్య ఇకపై మీ ఇంట్లోనే కొలువుదీరబోతున్నడు….
‘కలయా?…..నిజమా? అనుకుంటున్నారా…*….అయ్యో….నిజమే.. అయోధ్య రాముడు…అందాల రాముడు…అభినవ రాముడు…ఆదర్శ రాముడు… నేరుగా మీ ఇంటికే వస్తున్నడు… మీతోనే ఉండబోతున్నడు….
నిజమా?…..ఆయనకు దారెట్లా తెలుసని అనుకుంటున్నరా?…. మరీ జోక్ వేయకండి.. రాముడికి అడ్రస్ అవసరమా? ఒకవేళ నిజంగా అడ్రస్ అవసరమైతే….?… ‘‘సంజయ్’’ రాయబారం లేదా ఏం..?…. రాయబారం ఉప్పందిస్తే చాలు… అయోధ్య రామయ్య ‘‘బండి’ మీద ఊరూరా ఊరేగలేడా…. ఏం?….
నిజమే…. కరీంనగర్ జిల్లా ప్రజలు కలలు కన్న… ఎదురు చూస్తున్న అయోధ్య రాముడు…. అందాల రాముడు ప్రతి ఇంటా కొలువుదీరబోతున్నడు. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర ప్రాణ:ప్రతిష్ట ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణలో ప్రత్యేకించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికులు అయోధ్య వెళ్లాలని, శ్రీరామ చంద్రుడిని దర్శించాలని ఆశించిన వాళ్ల ప్రతి ఇంటికి అయోధ్ రామయ్య రాబోతున్నడు… ఆనాడు రామయ్యను గుండెలో పెట్టుకున్న హనుమంతుడి మాదిరిగా… ఈనాడు బండి సంజయుడు తన గుండెలో గూడుకట్టుకున్న రామయ్యను ఇంటింటా కొలువు దీరేలా అయోధ్య రామయ్య చిత్రపటాలను తయారు చేయించేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మంది ఓటర్లున్నారు? ఎన్ని కుటుంబాలున్నాయి? అందులో అయోధ్య రామయ్యను తలిచి కొలిచే వాళ్లెందరున్నారు? అనే వివరాలను సేకరించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 5 లక్షల కుటుంబాలకుపైగా ఉండగా… అందులో 4 లక్షలకుపైగా కుటుంబాలు హిందూ బంధువులని, అందులో సీతారామచంద్రుడిని కొలిచే కుటుంబాలు మెజారిటీ సంఖ్యలో ఉన్నాయని వెల్లడి కావడంతో ప్రతి హిందూ బంధువు ఇంటా అయోధ్య రామయ్య చిత్ర పటాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని 4 లక్షల 21 వేల 11 వందల అయోధ్య రాముడి చిత్ర పటాలను తయారు చేయించే పనిలో బండి సంజయ్ నిమగ్నమయ్యారు. ఇప్పటికే లక్షకుపైగా రామయ్య చిత్ర పటాలు సిద్ధం కావడంతో ఇంటింటికీ చేరవేసే పనిలో కాషాయ శ్రేణులు నిమగ్నమయ్యాయి.
మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు పల్లెకు పోదాం(గావ్ చలో…) కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ కుమార్ రేపు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలో పర్యటిస్తున్నారు. రేపు సాయంత్రం ఆ గ్రామమంతా పర్యటించడంతోపాటు స్థానికులతో మమేకం కానున్నారు. అంతేగాకుండా పార్టీకి సంబంధించి సామాన్య కార్యకర్త నివాసంలో స్థానికులతో కలిసి భోజనం చేయనున్నారు. దీంతోపాటు ఆ గ్రామంలోనే రాత్రి బస చేయనున్నారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ ప్రభుత్వం ఆ గ్రామానికి ఏం చేసిందనే అంశంతోపాటు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి పరిష్కార మార్గాలపై స్థానికులతో చర్చించనున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు, హిందుత్వ వాదులంతా రంగాపూర్ గ్రామంలో శ్రీరామ చంద్రుడిని తలిచి కొలిచే ప్రతి ఇంటికి అయోధ్య రాముడి చిత్ర పటాన్ని అందించే పనిలో నిమగ్నమవడం గమనార్హం.