Karnatakaelections2023: కర్ణాటక ఎన్నికల్లో విజయం ఏ పార్టీ వరిస్తుందన్న ఉత్కంఠకు 24 గంటల్లో తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా రీసెర్చ్ సంస్థలు వెలువరచనున్నాయి. ఈనేపథ్యంలోనే పీపుల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ ఆర్.దిలీప్‌రెడ్డి..బుధవారం సా॥ 6.30 గం॥లకు, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎగ్జిట్‌పోల్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ పోస్ట్ , పీపుల్స్ పల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను మీడియా వేదికగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.