ప్రధాని మోదీ తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చాలా అరుదు. అలాంటి వ్యక్తి సాగు చట్టాల విషయంలో తగ్గడానికి కారణాలేంటన్న చర్చ రాజకీయా వర్గాల్లో నడుస్తోంది. ప్రధాని పదవి చేపట్టాక అనేక సంక్షేమ పథకాలు.. సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధిలో పథంలో నడిపిస్తున్న నరేంద్రుడు.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా తీసుకొచ్చిన సాగు చట్టాల రద్దు నిర్ణయం.. విపక్ష నేతలనే కాకుండా, సొంత పార్టీనేతలను సైతం విస్మయపరిచింది.
ముందుగా సాగు చట్టాల రద్దుపై ప్రధాని ప్రసంగాన్ని క్లుప్తంగా చూసినట్లయితే.. వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయెజనాన్ని చేకూర్చేవే అయినప్పటికి.. ఓ వర్గం రైతులను ఒప్పించడంలో విఫలమైందున చట్టాలను వెన్నక్కి తీసుకుంతున్నట్లు ప్రధాని ప్రకటన చేశారు.
ఇక్కడ ప్రధాని ప్రసంగ సారాంశం నిశితంగా గమనించినట్లయితే.. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాడినికి ఉన్న ఏకైక అంశం సాగు చట్టాలు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాని ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సమావేశాల్లో ప్రతిపక్షాలు సభలను సజావుగా సాగకుండ విలువైన సమయాన్ని వృథా చేశాయి. ముఖ్యమైన బిల్లులను పాస్‌కాకుండా అడ్డుకున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా.. అసత్య ప్రచారాలు.. డ్రామాలతో.. కేంద్రాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేశాయి. ఈసారి వారికి అవకాశం ఇవ్వకుండ.. సాహసోపేతమైన నిర్ణయానికి ప్రధానికి పూనుకున్నాడని తెలుస్తోంది.
ఇక మొన్నటివరకు ఇంధన ధరల పెంపుపై రాద్దాంతం చేసిన ప్రతిపక్షాలకు ఉన్న సాగు చట్టాల అస్త్రాన్ని ప్రధాని దూరం చేశాడని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాసమస్యలు.. దేశ రక్షణ , భద్రత పరమైన అంశాలపై.. స్పందించకుండా రాజకీయ స్వార్థంతో కేంద్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనుకునే మేధావులకు సాగు చట్టాల నిర్ణయం మింగుడుపడటం లేదన్నది నిష్టుర సత్యం.
ఏతావాత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఊహించని నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న ప్రధాని మోదీ. మరోసారి సాగు చట్టాల రద్దుతో ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ కొట్టారు.వారికి ఉన్న ఒక్క అవకాశాన్ని దూరం చేసి షాకిచ్చారు.