ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత!

ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రపచవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న నేతల జాబితాలో మోదీ (7 కోట్ల ఫాల్లోవర్స్) 11 వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (12.9 కోట్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఇండియా విషయానికి వస్తే మోదీ తర్వాతి స్థానంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 4.5 కోట్లు. ఇక మూడో స్థానంలో పీఎంవో ఉండడం విశేషం. పీఎంవోను 4.3 కోట్ల మంది ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.కాగా 2009, జనవరిలో మోదీ ట్విట్టర్‌లో ఖాతా తెరిచారు. గడిచిన 11 ఏళ్లలో ఆయన ఏడు కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకోవడం గమనార్హం. కాగా ఆయన 2,350 మందిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. దేశంలోని మరే ఇతర రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ ఫాలోవర్ల విషయంలో మోదీకి దరిదాపుల్లో కూడా లేరు.