దడ పుట్టిస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్ సంకేతాలు..!

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఇది మూడోవేవ్​ ప్రారంభానికి సంకేతమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి! నిజంగానే థర్డ్​వేవ్ ప్రారంభమైందా? అదే నిజమైతే కోవిడ్ థర్డ్ వేవ్​ను ప్రపంచ దేశాలు ఏ మేరకు తట్టుకోగలవు?

ప్రపంచం కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో థర్డ్ వేవ్ సంకేతాలు దడ పుట్టస్తోంది. పలు దేశాల్లో కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. దీంతో మళ్లీ లాక్​డౌన్​ను ఆశ్రయించే పరిస్థితులు వస్తున్నాయి. భారత్ లోనూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కేరళ లాంటి రాష్ట్రాలు కేసుల పెరుగుదల దృష్ట్యా రెండు రోజులు లాక్ డౌన్ సైతం ప్రకటించాయి.
పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతున్న కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అమెరికాలో గత 24 గంటల్లో కేసుల సంఖ్య 61 వేలు దాటింది. ఆ దేశంలోని అర్హులైన లబ్ధిదారుల్లో సగం మంది టీకా రెండు డోసులు తీసుకున్న.. వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళనకరంగా మారింది. కోవిడ్ డెల్టా వేరియంట్ ప్రమాదకర వ్యాప్తి నేపథ్యంలో అమెరికా సీడీసీ సైతం తన మార్గదర్శకాలను సవరించింది. టీకా తీసుకున్నవారికి మాస్కులు అవసరం లేదని గతంలో సూచించిన సీడీసీ.. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న చోట ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.
కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరో నెల రోజుల పాటు లాక్​డౌన్ పొడిగించారు. ఆగస్టు 28 వరకు లాక్​డౌన్ కొనసాగుతుందని న్యూసౌత్​వేల్స్ ప్రభుత్వం ప్రకటించింది.దక్షిణ కొరియాలోనూ రికార్డు స్థాయి రోజువారీ కేసులు నమోదులో పెరుగుదల కనిపిస్తోంది.