రాజ్యసభకు ఇళయరాజా, విజేయేంద్ర ప్రసాద్, పిటి ఉష!

పెద్దల సభకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊహించని రీతిలో నలుగురు ప్రముఖులను నామినేట్ చేసింది. కళ, సాహిత్య రంగాల్లో సేవలందించిన ప్రముఖలను ఎంపిక చేసింది.ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, సినీ సంగీత దిగ్గజం ఇళయరాజ, పరుగుల రాణి పి.టి.ఉష,వీరేంద్ర హెగ్డేలు నామినేట్ జాబితాలో ఉన్నారు. మరోవైపు రాజ్యసభకు ఎంపికైన వారికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రచయిత విజేయేంద్రప్రసాద్ తన సేవలతో మన సంసృతిని ప్రపంచానికి తెలియజేశారన్నారు. ఇళయరాజా సంగీతం భవిష్యత్ తరాలకు వారధిగా నిలిచిందన్నారు. పి.టి. ఉష జీవితం.. ప్రతి భారతీయ పౌరుడికి ఆదర్శమని ప్రధాని కొనియాడారు.

 


రాజ్యసభకు విజేంద్రప్రసాద్, ఇళయరాజ ఎంపిక కావడం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. బాహుబలి విజయేంద్ర ప్రసాద్.. మోదీ ప్రభుత్వం రాజ్యసభకు ఎంపిక చేయడం తెలుగువారికి గర్వకారణమన్నారు రచయిత పరుచూరి గోపాల కృష్ణ. ఇళయరాజను రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి..సూపర్ స్టార్ఖ రజనీకాంత్ హర్షం వ్యక్తం చేశారు.