పవర్ స్టార్ తో సాయి పల్లవి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జోడీ కట్టనుంది. మలయాళ డబ్బింగ్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ లో పవర్ స్టార్ సరసన హీరోయిన్ గా పల్లవి ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. ‘అలా వైకుంఠపురం’చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ బ్యానర్ ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘తొలిప్రేమ’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు.

కాగా ‘అయ్యప్పనుమ్’ చిత్రంలో పవర్ స్టార్ తో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో ఆసక్తిగా నెలకొంది.

ఇక చిత్రంలో నటిస్తున్న రానా పవర్ స్టార్ తో నటించడం పై స్పందిస్తూ.. సినీజర్నీలో అందరూ స్టార్లతో నటించాను. ఇప్పుడే సరికొత్త సిని ప్రయాణం మొదలెట్టాబోతున్నాను.. మనందరి హీరో కూలెస్ట్ మ్యాన్ తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాను అంటూ రానా ట్వీట్ చేశారు.

Optimized by Optimole