అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ : మోడీ

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడి బడ్జెట్ అని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశం అనంతరం వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో విడుదల చేశారు. బడ్జెట్ లో వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు.. వ్యవసాయరంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కాగా బడ్జెట్పై కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. బడ్జెట్ లో వైద్య, విద్య రంగానికి అధిక కేటాయింపులు, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. కరోనా వేళ సరైన వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురయ్యాయని, దాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య రంగానికి అధిక కేటాయింపులు చేశామన్నారు.