యూట్యూబ్ ని షేక్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుదలైన టీజ‌ర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. కేవ‌లం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ వ్యూస్ చూస్తుంటే ప్ర‌భాస్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయమని అభిమానులు అంటున్నారు. టీజ‌ర్‌లో ప్రభాస్ సరికొత్తగా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ డార్లింగ్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు.కాగా ప్రభాస్ జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది. దీనికి జస్టిన్ ప్రభాకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.