సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్త కార్యవర్గం పగ్గాలు చేపట్టింది. అయినా మా ఎన్నిక వేడి ముగిసిపోలేదు.
ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ ప్యానల్ మాత్రం అన్యాయంగా, అరాచకత్వంతో విష్ణు ప్యానెల్ గెలుపొందిందని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు పోలింగ్ బూత్ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయనీ, వాటిని మాకిమ్మని ప్రకాష్‌రాజ్ ఇప్పటికే మా ఎన్నికల అధికారిని కోరారు. అయితే, మొదట నిబంధనలకు అనుగుణంగా ఇస్తామని చెప్పిన ఎన్నికల అధికారి… ఇప్పటి వరకూ మిన్నకుండిపోయారు. దీనితో, ప్రకాష్‌రాజ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఎన్నికల అధికారిని సిసి ఫుటేజ్ గురించి కోరారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. ప్రియమైన ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ గారూ .. ఇది ప్రారంభం మాత్రమే .. మాకు CC ఫుటేజ్ ఇవ్వండి .. ఏమి జరిగిందో ప్రపంచానికి తెలియజేస్తాం .. ఎన్నికలు ఎలా నిర్వహించబడ్డాయి..? జస్జ్ ఆస్కింగ్…! అంటూ వ్యంగ్యాస్త్రాలను విసిరారు. దీనికి సంబంధించి, కొన్ని సామాజిక మాధ్యమాల చిత్రాలను ట్విట్టర్ పోస్ట్‌కు జత చేశారు. అందులో అనుమానిత వ్యక్తి పై ఉన్న రిమాండ్ కాపీని కూడా జత చేశారు. దాన్ని బట్టి ఆ వ్యక్తి జగ్గయ్యపేటకు చెందిన రౌడీ షీటర్‌గా తెలుస్తుంది.