Telangana: తెలంగాణ శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా సూర్యదేవర ప్రసన్న కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.ఇండియన్ గవర్నమెంట్‌లో విభిన్న హోదాల్లో 30 ఏళ్లపాటు ప్రసన్నకుమార్ తన సేవలందించారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలపై ఆయనకు అపార అనుభవం ఉంది.ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సలహాదారుగా సీఎం రేవంత్‌రెడ్డి సిఫారసు చేయగా.. ఆ ప్రతిపాద నలను శాసన సభ, మండలి సభాపతులు గడ్డం ప్రసాద్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఆమోదించారు.