ట్రంప్ సర్ ట్రంప్ అంతే!

” నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో ”
అన్నాడో ఓ సినీ కవి.. కానీ వీటికి అక్షరాల సరిపోయే వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.
అతను అమెరికా అధ్యక్షుడిగా కంటే అతని చేష్టలతో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి ట్రంప్. పాలనలో సైతం తెంపరి నిర్ణయాలతో ‘నారూటే సపరేటూ’ అంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటాడు.
అధికార దాహంతో తిమ్మిని బొమ్మ చేయాలనుకునే అతని కుటిల బుద్ధికి అమెరికా ప్రజలు ఓటుతో సరైన గుణపాఠమే చెప్పారు. అయినప్పటికీ అతనిలో ఇసమెత్తు మార్పు సరికదా మొండిపట్టుదలతో, పదవివ్యామోహంతో అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ‘కళంకిత’ అధ్యక్షుడిగా మిగిలిపోయాడు.
రాజకీయాల్లో పార్టీలు పదవులు శాశ్వతం కాదన్న వాస్తవం తెలిసి కూడా ఎలాగైనా అధికారం చేజికించుకోవాలనే దుర్బుద్ధితో అమెరికా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అనైతిక చర్యలకు పాల్పడ్డాడు.
ఏనాయకడు ఎదుర్కొంటువంటి రెండు సార్లు అభిశంసన తీర్మానం.. అన్ని వైపుల నుంచి విమర్శలు, సొంత పార్టీ నుంచి వ్యతిరేకత పెరగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
మొదట్లో చెప్పుకున్నట్లు నలుగురు నడిచిన దారిలో అతను వెళితే ట్రంప్ ఎందుకవుతాడు? ‘ట్రంప్ కదా అతని దారే వేరు..అతని రూటే వేరు’ ‘ఒక్కమాటలో ట్రంప్ సర్ ట్రంప్ అంతే’